
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్నిరోజుల క్రితం తాత్కాలికంగా 'లాయర్ సాబ్' అని పిలవబడుతున్న పింక్ రీమేక్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఇది బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం పింక్ కు రీమేక్. ఇందులో అమితాబ్ బచ్చన్ మరియు తాప్సీ పన్నూ ప్రధాన పాత్రలను పోషించారు. తెలుగులో దిల్ రాజు మరియు బోనీ కపూర్ సంయుక్తంగా లాయర్ సాబ్ ను నిర్మిస్తున్నారు. చిత్ర పరిశ్రమలో అందుతున్న తాజా సమాచారం మేరకు, పవన్ కళ్యాణ్ 30 రోజుల కాల్ షీట్ల ప్రకారం సినిమా షూటింగ్ కు హైదరాబాద్ కు వచ్చి వెళ్ళడం జరుగుతుంది. దీనికోసం పవన్ కళ్యాణ్ కోసం దిల్ రాజు ప్రైవేట్ జెట్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పవన్ కేటాయించిన 30 రోజుల కోసం ఒక ఎయిర్‌లైన్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని హైదరాబాద్ ను ది వివిధ ప్రదేశాలకు పవన్ వెళ్లేందుకు ప్రైవేట్ జెట్ ఏర్పాటు చేశారని సమాచారం. ఈ ప్రైవేట్ జెట్ కోసం దిల్ రాజు ఏకంగా కోటి రూపాయిలు ఖర్చు చేస్తున్నారట.