
తెలుగునాట స్టార్ ప్రొడ్యూసర్ అనగానే ముందుగా దిల్ రాజు పేరు వినిపిస్తోంది. కరోనా కారణంగా భారీగా నష్టపోయిన నిర్మాతలలో దిల్ రాజు కూడా ఉన్నాడు. చేతిలో అన్నీ పెద్ద చిత్రాలు ఉండటం.., ఇప్పట్లో స్టార్స్ తో షూటింగ్ చేసే పరిస్థితులు లేకపోవడంతో.. రాజు గారికి ఎదురుదెబ్బె తగిలినట్టు అయ్యింది. దీనికి తోడు.., ఇప్పుడు అన్నీ సినీ పరిశ్రమలో ఓటీటీల హవా నడుస్తోంది. దీనితో.. మేకర్స్ అంతా చిన్న చిత్రాలను తెరకెక్కించి.., వెబ్ దునియాలో విడుదల చేసి.., భారీగా లాభాలను అర్జిస్తోన్నారు. ఈ కారణంగానే.. ఇప్పుడు 'దిల్ రాజు ప్రొడక్షన్స్' పై చిన్న చిత్రాలను తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడట ఈ నిర్మాత. ఈ మేరకు ఇప్పటికే 6 కథలను సిద్ధం చేయిస్తోన్నాడట స్టార్ ప్రొడ్యూసర్. ఓటీటీలకు మ్యాచ్ అయ్యే కంటెంట్ బేస్డ్ మూవీస్ పై స్పెషల్ ఫోకస్ పెట్టాడట రాజుగారు.