
ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్, జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్‌లతో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అందుకే తాను కూడా ట్రెండ్ ఫాలో అయ్యి రికార్డులు కొల్లగొట్టాలని దిల్ రాజు మల్టీస్టారర్‌ను రూపొందించాలని యోచిస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి. ఆ మల్టీస్టారర్ ను పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రభాస్ కు ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో లో ఉందో ఎంత చెప్పిన తక్కువే. తను చేసే ప్రతి సినిమా కచ్చితంగా భారీ బడ్జెట్ మరియు పాన్ ఇండియా లెవల్ సినిమానే అయ్యుంటుంది. మరో పక్క బన్నీను పాన్ ఇండియన్ హీరో అని పిలవకపోవచ్చు కానీ క్రేజ్ పరంగా ఎం తక్కువ కాదు. ఇలాంటి స్టార్లతో మల్టీస్టారర్ అంటేనే మజా వస్తుంది. మరి దిల్ రాజు ప్లాన్ చేస్తున్న ఈ మల్టీస్టారర్ సెట్స్ పైకి వెళ్తుందో లేదా పుకారు గానే మిగిలిపోతుందో చూద్దాం!