
టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు వైగా రెడ్డిను మే 10న నిజామాబాద్ లోని ఒక గుడిలో కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన విషయం అందరికి తెలిసిందే. దిల్ రాజు భార్యతో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. కరోనా పుణ్యమా అని షూటింగ్లు, సినిమా రిలీజ్ లు వంటి పనులు లేకపోవటంతో కాసేపు తన కంపెనీకి సంబంధించిన పనులు చూసుకుంటూ కుదిరినంత సమయం తన భార్యను మరింత అర్ధం చేసుకొని, మరింత ప్రేమించే పనిలో పడ్డారు. తాజగా దిల్ రాజు భార్యతో కలిసి దిగిన ఒక అందమైన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ ఫోటోలో ఇద్దరు ఎంతో ఆనందంగా, రొమాంటిక్ గా కనిపిస్తున్నారు. ఇక నాని, సుదీర్ బాబులు హీరోలుగా దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన 'V' చిత్రం కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడింది. మరి దిల్ రాజు ఈ సినిమా రిలీజ్ పై ఎం ప్లాన్ చేస్తున్నాడో తెలియాల్సి ఉంది.