
చిత్ర పరిశ్రమలో తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు మరోసారి పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. సినీ ఇండస్ట్రీలో, దిల్ రాజుకు తిరుగులేదు. ఇటీవలే విడుదలైన మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'సరిలేరు నీకెవ్వరు', 'అల...వైకుంఠపురములో' సినిమాల నుండి మంచి లాభాలు రావటంతో ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రస్తుతం దిల్ రాజు నిర్మించిన 'జాను' రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్ళు సాధిస్తూ దూసుకుపోతుంది. అలానే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పింక్ రీమేక్ ను నిర్మిస్తున్నారు. అయితే పర్సనల్ లైఫ్ లో దిల్ రాజు ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో దిల్ రాజు పెళ్లి చేసుకోబోతున్నారు. త్వరలో సమయం చూసి దినికి సంబంధించిన ప్రకటన ఇవ్వనున్నారు. దిల్ రాజు భార్య కొన్నేళ్ల క్రితం మరణించారు. ఆ తరువాత అతని బంధువులు, స్నేహితులు అతన్ని మరో వివాహం చేసుకోమని సూచిస్తున్నారట. మరి దిల్ రాజు ఎప్పుడు, ఎవరిని చేసుకోబోతున్నారన్నది వేచి చూడాలి.