
బాహుబలి సినిమాతో తెలుగు చలన చిత్ర గురించి జాతీయ, అంతర్జాతీయ మీడియా మాట్లాడుకునే స్థాయికి తీసుకెళ్లారు దర్శకుడు రాజమౌళి. అలాంటి క్వాలిటీ ఔట్ పుట్ రావటానికి డబ్బుల గురించి వెనకాడకుండా మొదటి నుంచి ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ రికార్డులు బద్దలు కొట్టడానికి కారణమయ్యారు నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని. అయితే బాహుబలి చిత్రం తర్వాత మరే సినిమాను అంత ఈజీగా ఒప్పుకోకుండా క్వాన్టిటి కంటే క్వాలిటీ ముఖ్యం అని భావించి ఎంతో కాలం తర్వాత ఒక దర్శకుడిని ఓకే చేశారు. అది మరెవరో కాదు "కేర్ ఆఫ్ కంచెరపాలెం" దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో ఒక సినిమాను నిర్మిస్తున్నారు. మలయాళ హీరో ఫాహద్ ఫాజిల్ హీరోగా నటించిన హిట్ చిత్రం `మహేశింతే ప్రతీకారమ్` చిత్రానికి రీమేక్ ఇది. ఇప్పటికే షూటింగ్ కూడా 90% పూర్తి అయ్యిందని తెలుస్తోంది. 2020 ఏప్రిల్ 17న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి తెలుగులో `ఉమామహేశ్వర ఉగ్రరూపాశ్య` అనే టైటిల్ను ఖరారు చేశారు.