
2020 ఎలా ఉంటుందోనని ఆశగా ఎదురుచూస్తున్న వాళ్లకు కరోనా మహమ్మారి వచ్చి ఆశలను అడియాశలు చేసింది. కరోనా రోజు రోజుకు విజృభిస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏ మూల నుంచి వస్తుందో తెలియని పరిస్థితి. మొన్నీమధ్యే దేశ హోమ్ మంత్రి అమిత్ షాకు, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, మన దర్శక దిగ్గజం రాజమౌళికి కరోనా సోకిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా టాలీవుడ్ మరో దర్శకుడు దిని భారిన పడ్డాడు. అతనే, 'నువ్వు నేను', 'జయం', 'నిజం' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన దర్శకుడు తేజకు కరోనా పాజిటివ్ అని తేలిందు. ప్రస్తుతం వెబ్ సిరీస్ ను తెరకెక్కించే పనిలో ఉన్న తేజకు కొంచెం కరోనా లక్షణాలు రావడంతో పరీక్షా చేయించుకొనగా పాజిటివ్ అని తేలింది. అయితే తాను ఆరోగ్యంగానే ఉన్నాను, ఇంట్లోనే ఐసొలేట్ అవుతున్నానంటూ సోషల్ మీడియా వేదికగా తెలియజేసారు.