
మాస్ మహారాజా రవితేజా నటించన చిత్రం డిస్కో రాజా సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ నుండి ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ లభించింది. అన్ని అడ్డంకులను ఎదుర్కొని, విఐ ఆనంద్ దర్శకత్వం వహించిన 'డిస్కో రాజా' జనవరి 24 న గ్రాండ్ రిలీజ్ కోసం సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు విఐ ఆనంద్ మాట్లాడుతూ, "డిస్కో రాజా కథ
80 వ శతాబ్దంలో సెట్ చేయబడింది. రవితేజ, డిస్కో సంగితాన్ని ఇష్టపడే గ్యాంగ్ స్టర్, మిథున్ చక్రవర్తి అభిమాని, మరియు ఫుల్ యటిట్యూడ్ తో ఉంటాడు. రవితేజ క్యారెక్టర్ చాలా క్రెజిగా ఉంటుంది. ఇప్పటి వరకు ఆయన పోషించిన సినిమాల కన్నా భిన్నంగా ఉంటుందని" తెలిపారు. నేషనల్ అవార్డ్ గ్రహీత బాబీ సింహ విలన్ గా కనిపించనున్నారు. సుమారు ఏడాది గ్యాప్ తర్వాత రవి తేజ మళ్ళీ తెరపై ఈ సినిమాతో కనిపించబోతున్నాడు. మరి ముగ్గురు హీరోయిన్స్ ఉన్న ఈ సినిమా రవి తేజకు సక్సెస్ ఇస్తుందో లేదో చూడాలి.