
నవంబర్ 28న తొండూపల్లి సమీపంలో నలుగురు లారీ డ్రైవర్లు దిశను రేప్ చేసి చంపేశారు. దిశ అత్యాచారం దేశాన్ని కుదిపేసింది. ఆ నిచులకు, కిరాతకులకు శిక్ష పడాలంటూ దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అయితే మరుసటి రోజే ఆ నలుగురిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించగా... గురువారం విచారణ జరిపేందుకు...సిన్ రికన్స్ట్రాక్షన్ చేసేందుకు ఘటన జరిగిన ప్రాంతంకు నిందితులను తీసుకెళ్లారు. అక్కడ సాక్ష్యాలు సేకరిస్తుండగా నిందితులు పారిపోయే ప్రయత్నం చేసి, పోలీసుల ఆయుధాలను సైతం లాక్కునే ప్రయత్నం చేయటంతో పోలీసులు నలుగురిని ఎంకౌంటర్ చేసినట్లు తెలిపారు. ఈ సమయంలో పోలీసులకు కూడా గాయాలయ్యినట్లు తెలుస్తోంది. నిందితుల ఎంకౌంటర్ జరగడంతో దిశకు న్యాయం జరిగిందని దేశమంతా ఆనందం వ్యక్తం చేస్తుంది.