
తెలంగాణ షాద్ నగర్ లో కొన్నిరోజుల క్రితం జరిగిన ప్రియాంక రెడ్డి హత్యాచారం పట్ల దేశం మొత్తం ఆగ్రహంతో ఊగిపోతుంది. ప్రియాంక కనిపించని కొన్ని ఘంటలకే మేము పోలీసు స్టేషన్కు వెళ్తే ఇది మా పరిధిలోకి రాధుయా అంటూ తమని తిప్పారని ప్రియాంక తల్లిదండ్రులు ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై సార్వత్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. పోలీసుల తీరుపై దేశం మొత్తం మండిపడుతోంది. అందుకేనేమో జగన్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అమ్మయిలపై అఘాయిత్యాలను తగ్గించేందుకు తెలంగాణ కంటే ఏపీ చాలా ముందుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు కేవలం ముంబై, ఢిల్లీ నగరాల్లో అమల్లో ఉన్న జీరో ఎఫ్ఐఆర్ ను ఏపీలో ఆముల్లోకి తీసుకరానుంది ఏపీ ప్రభుత్వం. జీరో ఎఫ్ఐఆర్ అంటే సరిహద్దులతో సంబంధం లేకుండా దగ్గర్లో ఉన్న ఏ స్టేషన్లోనైనా కంప్లైంట్ ఫైల్ చెయ్యెచ్చు. దానిపై తక్షణ విచారణ జరిపిన అనంతరం ఆ ప్రాంత పరిధిలోని పోలీస్ స్టేషన్కు సదరు కేసు బదిలీ అయిపోతుంది. మరి ఈ జీరో ఎఫ్ఐఆర్ ను తెలంగాణలో ఎప్పుడు అమల్లోకి తెస్తారో చూడాలి.