నువ్వు విగ్గులతోనే సినిమాలు చేస్తావా ?? అల్లు అర్జున్ ను టార్గెట్ చేసిన శ్రీరెడ్డి
4 years ago

స్టైలిష్ స్టార్ లు అర్జున్ కు ఉన్న క్రేజ్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. తెలుగు ఇండస్ట్రీలోనే కాక దక్షిణాది మొత్తం బన్నీకు ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి లేదు. అతని స్టైల్, డ్యాన్సింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. బన్నీ నాన్న అల్లు అరవింద్ బడా ప్రొడ్యూసర్ అయినప్పటికి సినిమా పట్ల తనకున్న డెడికేషన్, కష్టంతో అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజున సినీ పరిశ్రమలో తనకంటూ పదిలమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. అయితే శ్రీరెడ్డి చేసిన నిరసనలు, సెలెబ్రెటీలపై చేసిన ఆరోపణలు, ఫిల్మ్ ఛాంబర్ ముందు చేసిన రచ్చ కారణంగా ఇప్పుడు ఇమే అందరికి సూపరిచితురాలైంది. కొన్ని రోజుల పాటు మీడియాలో ఇమేనే హాట్ టాపిక్ గా నిలిచింది. నాని, విశాల్, దగ్గుబాటి అభిరామ్ ఇలా ఎంతోమందిపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ ను టార్గెట్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. తాజాగా ఆమె ఫేస్బుక్ వేదికగా ... "అల్లు అర్జున్, ఎప్పటికైనా నీ ఒరిజోనల్ జుట్టుతో సినిమాలు చేస్తావా ? లేదా ఎప్పుడు అతికించిన విగ్గులేనా ?" అంటూ అల్లు అర్జున్ ను టార్గెట్ చేస్తూ పోస్ట్ పెట్టింది.