
మెగా కాంపౌండ్ నుండి ఎంత మంది హీరోలు వచ్చారో తెలిసిందే. వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అల్లు అర్జున్ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను ఏర్పరచుకొని, టాలీవుడ్ బడా హీరోల జాబితాలో చేరిపోయారు. మరోపక్క వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్‌లు కూడా భిన్నమైన కధలను ఎంచుకుంటూ మంచి గుర్తింపు పొంది..దూసుకుపోతున్నారు. ఇక ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో అరంగ్రేటం చేయనున్నాడు. ఆ మెగా హీరో మరెవరో కాదు సాయి ధరమ్ తమ్ముడు విష్ణు తేజ్. 'ఉప్పెన' సినిమాతో త్వరలో తెలుగు తెరకు పరిచయం కానున్నాడు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే సినిమా బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువవుతోందని సమాచారం. స్టార్ కాస్ట్, లోకేషన్స్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతూ...రూ.25కోట్లకు చేరిందట. ఎంత మెగా హీరో అయినప్పటికీ ఇది రిస్క్ అనే చెప్పాలి. మొదటి సినిమాకే ఇంత బడ్జెట్ అంటే....కష్టమే మరి. పెట్టిన డబ్బులు తిరిగొస్తాయో, రావో అన్న ఆందోళన నిర్మాతల్లోనూ ఉంది.