
ఆర్ఆర్ఆర్ మొదలయినప్పటి నుంచో వార్తల్లో నిలుస్తోంది. రాజమౌళి, రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ ఒక సినిమా కోసం జతకట్టారు అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో వేరే చెప్పాల్సిన పని లేదు. తాత్కాలికంగా ఆర్ఆర్ఆర్ పేరుతో, పిలవబడుతున్న ఈ చిత్ర షూటింగ్ చాలా చురుకైన వేగంతో జరుగుతోంది. ఇటీవలే ఆర్ఆర్ఆర్ బృందం ఈ సినిమాను జూలై 30, 2020 నుండి జనవరి 8, 2021 కు వాయిదా వేసింది. ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్ ఈ సినిమా సెట్స్‌లో చేరి తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుండి ఈ చిత్రంలో అజయ్ దేవ్గన్ రెమ్యునరేషన్ గురించి అనేక పుకార్లు వచ్చాయి. 30 నిమిషాల వ్యవధి ఉన్న అతని పాత్రకు 25 కోట్లు తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, అజయ్ దేవ్గన్ రెమ్యునరేషన్ గస్ ఒక్క రూపాయి కూడా తీస్కోలేదట. రాజమౌళితో పని చేయడం చాలు అంటూ జక్కన్న ఇస్తానన్న రెమ్యునరేషన్ కు కూడా నో చెప్పాడట.