
డ్రింక్ అండ్ డ్రైవ్ కారణంగా ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో రోజు వార్తల్లో చూస్తూనే ఉంటాం. అందుకనే ప్రతి సినిమా ముందు ముందు, ధుమపానం ఆరోగ్యానికి హానికరమని చెప్తుంటారు. డ్రింక్ చేసి నడపడం వల్ల వారితో పాటు ఎదుటివారి ప్రాణానికి కూడా హాని జరుగుతుంది. అందుకే పోలీసులు సిటీలలో ఎక్కడపడితే అక్కడ నిఘా పెడుతున్నారు. ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే తాజాగా ఓ తెలుగు యంగ్ హీరో డ్రింక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో దొరికి కోర్టు ముందు హాజరయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 1 తో ఫెమస్ అయిన నటుడు ప్రిన్స్ బాచూపల్లిలో డ్రింక్ అండ్ డ్రైవ్ లో పెట్టుబడి కూకట్పలి కోర్టులో హాజరయ్యాడు. కోర్టు నిర్ణయించిన ఫైన్ చెల్లించి బయటకు వచ్చేటప్పుడు మీడియా కంటపడ్డాడు. ఇకపోతే ప్రిన్స్ ప్రస్తుతం సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.