
లవ్లీ, అడ్డా, రౌడీ వంటి సినిమాలతో తెలుగు తెరకు హీరోయిన్ గా సూపరిచితురాలైంది శాన్వి శ్రీవత్సవా. చాలా కాలానికి ఆమె నటించిన "అతడే శ్రీమన్నారాయణ" సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా పలు భాషల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో ముచ్చటించిన శాన్వి శ్రీవత్సవా ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యింది. "నేను అందంగా లేనేమో, లేదా నాకు నటించడం రాదేమో తెలిదుకానీ టాలీవుడ్ లో మాత్రం నాకు అవకాశాలు రాలేదు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన "రౌడి" సినిమా తర్వాత మరే సినిమా అవకాశం రాలేదు. ఒక ఏడాదికి పైగా సినిమాలు లేక ఖాళీగా ఉన్నాను.ప్ ప్రతి రోజు రాత్రి ఏడ్చేదాని నేనెం తప్పు చేశాను...నాకెందుకు అవకాశాలు రావట్లేదని. ఇంతకాలనికి "అతడే శ్రీమన్నారాయణ" తో మళ్ళీ నన్ను నేను నిరూపించుకునే అవకాశం వచ్చిందని" భావోద్వేగానికి గురయ్యింది.