
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న, రక్షీత్ శెట్టి విడిపోయి ఉండోచ్చు, కాని ఇద్దరూ ఇంతకుముందు కలిగి ఉన్న గౌరవాన్నే కొనసాగిస్తున్నారు. కిరిక్ పార్టీ ఫేమ్ రక్షిత్ శెట్టి తన 'అతనే శ్రీమన్నారాయణ' విడుదల సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపిన తరువాత, ఇప్పుడు రష్మిక మందన్న తన మాజీ ప్రియుడి గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. అయితే నటి నివాసం మరియు ఆస్తులు ఆదాయపు పన్ను అధికారులు తనిఖీలు నిర్వహించక ముందే రికార్డ్ చేయబడిన ఓ ఇంటర్వ్యూలో, రష్మిక మందన్నను రక్షిత్ శెట్టి గురించి ఒక మాట చెప్పమని అడిగగా... దీనికి ఛలో నటి, “రక్షిత్ శెట్టి ఒక అద్భుతమైన వ్యక్తి" అంటూ సమాధానం ఇచ్చింది. మరోవైపు రష్మీక చేతిలో ప్రస్తుతం అన్ని పెద్ద సినిమాలే ఉన్నాయి. ఆమె అనిల్ రావిపూడి దర్సకత్వంలో మహేష్ బాబుతో నటించిన తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' సక్సెస్ తో తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది.