
పక్క కమర్షియల్ సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పటి వరకు తీసిన 4 సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించాయి. అందుకే హీరోలు ఆయనతో సినిమా తీసేందుకు క్యూ కడుతున్నారు. ఇకపోతే తాజాగా ఎఫ్ 2 సిక్వెల్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. వెంకటేష్, వరుణ్ హీరోలుగా తమన్నా, మెహ్రిన్ హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆగస్టు 27న రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే అనిల్ రావిపూడి సినిమాలు ఎప్పుడు సంక్రాంతి భరిలో నిలిచి హిట్ కొడ్తాయి. కానీ ఈసారి మాత్రం ఆ అవకాశం లేకపోవటంతో ఆగస్టు లోనే వచ్చేస్తున్నాడు. మరి ఆగస్టు లో కూడా తన సక్సెస్ జర్నీ కంటిన్యూ అవుతుందేమో చూడాలి.