
కెరియర్ లో ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటుంది సమంత అక్కినేని. తన వర్కౌట్ వీడియోలు, ఫోటో షూట్లకు సంబంధించిన ఫోటోలు ఇలా ఏదోకటి ఫ్యాన్స్ తో షేర్ చేస్తూనే ఉంటుంది. అల...తాజాగా చిరునవ్వులు చిందిస్తూ 'ఫీలింగ్ గుడ్' అంటూ ఒక ఫోటోను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. అయితే ఆ ఫోటోకు ఒక నెటిజన్ 'మీరు విడాకులు తీసుకోవచ్చు కదా, మన ఇద్దరం పెళ్లి చేసుకుంద్దాం' అని కామెంట్ చేసాడు. ఇది చూసిన సామ్ 'కష్టం..ఒక పని చెయ్ వెళ్లి చైను అడుగు' అంటూ చమత్కారంగా సమాధానం ఇచ్చింది. ఇది చూసిన ఆమె అభిమానులు సామ్ బలేగా సమాధానమిచ్చారంటూ కొనియాడుతున్నారు. ఏదేమైనా సామ్ తనకు ఎదురయ్యే ప్రశ్నలకు సూటిగా, సుత్తి లేకుండా సమాధానం ఇవ్వడంలో దిట్ట!
Tags: #Cinecolorz #Samantha #Tollywood