
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కు ఉరికే స్టైలిష్ స్టార్ అన్న పేరు రాలేదు. సినిమా, సినిమాకి కంప్లిట్ మెకోవర్ తో అదిరిపోయే డ్రెస్సింగ్ తో పిచ్చ స్టైలిష్ గా ఉంటాడు కాబట్టే అభిమానులు అభిమానంతో ఆ పేరును ఇచ్చారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టైల్ విషయంలో ఎప్పుడు కాంప్రమైజ్ అయింది లేదు. రిచేస్ట్ కొడుకు ఆనంద్ గా అయిన, మిడిల్ క్లాస్ అబ్బాయి బంటుగా అయిన బన్నీ కచ్చితంగా తన యాటిట్యూడ్, డ్రెస్సింగ్ లో కొత్తదనం చూపిస్తూనే ఉంటాడు. ఈ ఏడాది అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అల..వైకుంఠపురంలో' భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ సినిమా ఇచ్చిన జోష్ తో సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమాకి సిద్ధమవుతున్నాడు బన్నీ. ఈ మూవీలో బన్నీ మాస్ అవతారంలో కనిపించనున్నాడు. దానికోసం తనని తాను పూర్తిగా మార్చుకున్నాడు. జుట్టు, గడ్డం అంతా మారిపోయిందన్న విషయం చిత్ర యూనిట్ ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే అర్ధం అవుతుంది. అయితే తాజాగా బన్నీ గీతా ఆర్ట్స్ ఆఫీస్ కి వెళ్లడం జరిగింది. అప్పుడు దిగిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు స్టైలిష్ స్టార్. ఆ ఫోటోలో సింపుల్ రెడ్ టి షర్ట్, గాగుల్స్, రింగుల జుట్టు, గడ్డంతో మాస్ గా కనిపిస్తూనే స్టైలిష్ గా ఉన్నాడు. ఈ ఫోటో పెట్టడం ఆలస్యం బన్నీ ఫ్యాన్స్ వేల షేర్లు, లక్షల లైకులతో వైరల్ చేస్తున్నారు.