
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో ఒకరు వరుణ్ తేజ్. ముకుంద సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన వరుణ్ మొదట్లో కథల ఎంపిక విషయంలో కాస్త తొందరపాటు తనం చూపించినా ఇప్పుడు చాలా తెలివిగా కధలను ఎంచుకుంటున్నాడు. ఫిదా, తొలిప్రేమ లాంటి హిట్స్ రావటంతో వరుణ్ కు మంచి మార్కెట్ ఏర్పడింది. నిర్మాతలు కూడా వరుణ్ తో సినిమా తీస్తే సేఫ్ జోన్ లో ఉంటామని భావిస్తున్నారు. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు, ఫాలోయింగ్ సంపాదించుకున్న వరుణ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి అనే నూతన దర్శకుడుతో బాక్సింగ్ నేపథ్యంలో ఒక సినిమా చేస్తున్నాడు. తాజాగా నటించిన గద్దలకొండ గణేష్ కూడా మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటె తాజాగా వరుణ్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ అభిమానులకు తెగ నచ్చేసింది. వీళ్ళే నా బలం అంటూ నాగబాబు,మెగాస్టార్,పవన్ కళ్యాణ్ తో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేసాడు. ఇది చూసి మెగా ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోతున్నారు.