
అభిమానులు తలుచుకుంటే ఏమైనా చేస్తారనేది మరోసారి రుజువైంది. కరోనా టైంలో మహేష్ పుట్టినరోజు వచ్చిందే అని బాధపడకుండ మహేష్ కు బ్లాక్ బస్టర్ బహుమతి ఇచ్చారు. అది కూడా చెప్పి మరీ. ట్విట్టర్ లో 5కోట్ల ట్యాగ్లతో రికార్డు సృష్టిస్తామని చెప్పిన మహేష్ ఫ్యాన్స్ ఏకంగా #HBDMaheshBabu అనే ట్యాగ్ తో 6.2కోట్ల ట్వీట్లు చేసి వరల్డ్ రికార్డు క్రియేట్ చేశారు. దీన్ని చూస్తేనే అర్ధమవుతుంది సూపర్ స్టార్ ఎందుకు అయ్యారో, ఎలా అయ్యారో. ఇప్పుడు టాలీవుడ్లో చిరంజీవి తర్వాతి స్థానానికి ప్రయత్నిస్తున్న మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే అది కష్టమైన విషయం కానే కాదని తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే మహేష్ ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్నాడు.