
సినిమా అంటే కోట్లల్లో వ్యవహారం. అందుకే ఏ అడుగు వేసిన ఎంతో అలోచించి ముహుర్తాలు చూసుకొని వేస్తారు. అలానే ఒక మంచి రోజు చూసి సినిమా ప్రారంభించారు ప్రభాస్ ఆదిపురుష్ టీం. కానీ మొదటి రోజే హంసపాదు ఎదురైంది. షూటింగ్ మొదలైన రోజు సాయంత్రం స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దింతో ముహూర్త బలం బాలేదని పండితులు విశ్లేసిస్తున్నారు. మొదట్లోనే ఇలాంటి ఆటంకం రావడానికి కారణం ముహూర్త బలం అయుంటుందని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ప్రభాస్ మరో సినిమా సలార్ విషయంలో కూడా ఇదే జరిగిందనే వాదన వినిపిస్తుంది. దింతో ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు ఇంట్లో శాంతి పూజలు నిర్వహించారని సమాచారం. ఏదైనా దిష్టి ఉన్నా, శని ఉన్నా పోతుందని భావించి ఈ పూజలు జరిపించారట.