
రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి లాంటి ఇంటెర్నేష్నల్ స్థాయి సినిమా తర్వాత యంగ్ డైరెక్టర్ సుజీత్ తో 'సాహో' సినిమా తీసిన విషయం తెలిసిందే. ఇలాంటి రెండు బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సినిమాల తర్వాత రాధా కృష్ణ దర్శకత్వంలో పీర్యాడిక్ లవ్ స్టోరీతో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ జంటగా పూజా హెగ్డే నటిస్తుంది. తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను పెంచింది.
లవ్ స్టోరీలో ప్రభాస్ ను చూసి చాలా రోజులు అవుతుండటంతో ఈ సినిమా డార్లింగ్ ప్రభాస్ ను మళ్ళీ తీసుకొస్తుందని అభిమానులు ఆశ పడుతున్నారు. ఇక నేడు పూజా హెగ్డే పుట్టినరోజు సందర్బంగా చిత్ర యూనిట్ సినిమాలోని ఆమె పాత్ర పేరు మరియు ఆమె లుక్ ను రివీల్ చేసారు. రిలీజ్ అయిన పోస్టర్ లో పూజా పేరు ప్రేరణగా తెలుస్తుంది. ఇందులో ప్రభాస్ ఆమెను చూస్తూ కూర్చొని ఉండగా ఆమె నవ్వుతు అప్పటి యువరాణిల కనిపిస్తుంది. ఈ పోస్టర్ లో హీరో, హీరోయిన్లు ఒక ట్రైన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ప్రేరణ నవ్వుతోనే మాయ చేసేలా ఉంది.