
టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్లలో ఒకరైన పూరి జగన్నాథ్ కు బ్యాంగ్కాక్ అంటే మహా ఇష్టం. ఎంత ఇష్టమంటే తన సినిమా ప్రారంభానికి ముందు ఆ తర్వాత బ్యాంగ్కాక్ కు కచ్చితంగా వెళ్లాల్సిందే. అయితే ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా పూరి జగన్నాథ్ ను ఫాలో అవుతున్నాడు. కాకపోతే మరి పూరి అంత కాదు కానీ.... న్యూ ఇయర్ ఫ్యామిలీతో జరుపుకునేందుకు ఈసారి బ్యాంగ్కాక్ ను సెలెక్ట్ చేసుకున్నాడు. న్యూ ఇయర్ వచ్చిందటే చాలు అందరికి పండగే. మరి ముఖ్యంగా సెలెబ్రెటీలు తమ షెడ్యూల్ ను పక్కన పెట్టేసి మరి వెకేషన్ కు వెళ్తారు. అలానే అల్లు అర్జున్ కూడా అల..వైకుంఠపురంలో సినిమా షూటింగ్ పూర్తి అవ్వడంతో ఫ్యామిలీ, పిల్లలతో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కు బ్యాంగ్కాక్ కు వెళ్లడం విశేషం. బ్యాంగ్కాక్ నుంచి తిరిగి రాగానే అల..వైకుంఠపురంలో ప్రమోషన్స్ లో పాల్గొంటాడు.