
రెండు దశాబ్దాల పాటు పాకిస్థాన్ సైనిక ఆర్మీ చీఫ్ గా ఉన్న ముషారఫ్ ఆ తర్వాత సైనిక పాలన ద్వారా అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. అయితే 2007లో ఎమర్జెన్సీకు సంబంధించి పర్వేజ్ ముషారఫ్ తీసుకున్న నిర్ణయంపై పీఎంఎల్ పార్టీ కోర్టును ఆశ్రయించగా...విచారణ జరిపిన న్యాయస్థానం ఆయన దేశద్రోహి అంటూ నిర్ధారించింది. అయితే నేడు పాకిస్థాన్ లోని పెషావర్ హైకోర్టు పర్వేజ్ ముషారఫ్ కు ఉరిశిక్ష విధించింది. పాకిస్థాన్ చరిత్రలోనే ఇలా జరగడం మొదటిసారి. 2001 నుంచి 2008 వరకు అధికారంలో ఉండి..ఎక్కువ కాలం అధికారంలో ఉన్న నేతల్లో ముషారఫ్ ఒకరు. 2016లో మెడికల్ ట్రీట్మెంట్ కోసమని దుబాయ్ వెళ్లిన ముషారఫ్ ఇప్పటి వరకు పాకిస్థాన్ కు తిరిగి వెళ్లలేదు. అయితే ఆయన ఆస్తులను జప్తు చేయాలని కోర్టు ఆదేశాలను జారీ చేసింది.