
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఆచార్య షూటింగ్ లో పాల్గొంటున్నాడు. మరో వైపు మురళి మోహన్ ఆర్కా మీడియా వారి షూటింగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్లారు. తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ కూడా రామోజీ ఫిల్మ్ సిటీలోనే మణిరత్నం మూవీ షూటింగ్ లో ఉన్నారు. మురళి మోహన్ మరియు శరత్ కుమార్ లు కలిసి ఆచార్య షూటింగ్ సెట్ కు వెళ్లి చిరంజీవిని కలవడం జరిగింది. వీరు ముగ్గురు కలిసి సరిగ్గా 30 ఏళ్ల క్రితం గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించారు. ఆ సినిమాలో ఈ ముగ్గురు అన్నదమ్ముల మాదిరిగా నటించారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత వీరు ముగ్గురు కూడా ఒకే ఫ్రేమ్ లోకి వచ్చారు. దాంతో చిరంజీవితో పాటు మురళి మోహన్ ఇంకా శరత్ కుమార్ కూడా తమ ఆనందం వ్యక్తం చేశారు. చాలా రోజుల తర్వాత ముగ్గురం కలవడం చాలా ఆనందాన్ని కలిగించిందని అంటున్నారు.