
బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగులో ప్రయోగాత్మకంగా వచ్చినప్పటికీ ప్రేక్షకులను మెప్పించటంలో సఫలం అయ్యారు. అందుకే ఇప్పటికే నాలుగు సీజన్లు ఘన విజయంగా నిర్వహించారు. అయితే బిగ్ బాస్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలుగు సీజన్ 4 సీనియర్ సిటిజన్ అయిన 'గంగవ్వ'ను కంటెస్టెంట్ గా తీసుకొచ్చారు. 'మై విలేజ్ షో' అనే యూట్యూబ్ ఛానెల్ తో ఫెమస్ అయిన ఈ అవ్వ షోలో కూడా నిలదొక్కుకునేందుకు తనవంతు ప్రయత్నం చేసి ఇక చేతకాక మధ్యలోనే బయటకు వచ్చేసింది. అయితే వచ్చే ముందు నాగార్జునను తనకు ఇల్లు కట్టివ్వమని అడగగా అందుకు నాగ్ సరేనని మాట కూడా ఇచ్చాడు. అయితే గంగవ్వ ఇంటి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ యాజమాన్యం దగ్గరుండి ఇంటి నిర్మాణ పనులు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఇంటి పురోగతి చూపిస్తూ గంగవ్వ సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.