
సెప్టెంబర్ 6న తెలుగు బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ అంగరంగ వైభవంగా మొదలైంది. ఎన్నో అంచనాల నడుమ స్టార్ట్ అయిన బిగ్ బాస్ లోకి ఎంతోమంది ఫెమస్ పర్సనాలిటీస్ అడుగుపెట్టారు. అయితే మై విలేజ్ షో యుట్యూబ్ ఛానెల్ తో సెన్సేషనల్ అయిన 'గంగవ్వ' కూడా కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి షాక్ ఇచ్చింది. ఎక్కడో లంబాడిపల్లి నుంచి నేడు ఆమెను బిగ్ బాస్ హౌస్ లో ఉంచేలా చేసింది ఆమె ప్రతిభ. అయితే బిగ్ బాస్ లోకి వెళ్లిన అవ్వ ముడతలు పడి, నేసిన చీరలు కడుతూ, తెల్ల జుట్టుతో, పళ్ళు కొన్ని ఉడిపోయాయి కాబట్టి పెద్దావిడ అని పిలుస్తున్నాం. ఇంతకీ అవ్వ వయసు ఎంతో తెలుసా? సుమారుగా 58 సంవత్సరాలు. మరి బిగ్ బాస్ ను హోస్ట్ చేస్తున్న నాగార్జున ఫిట్ గా, ఇంకా బాడీ మైంటైన్ చేస్తూ, డ్రెస్సులు ఇరగతిస్తూ, జుట్టు నెరవకుండా ఉన్నాడు కాబట్టి ఇంకా మన్మధుడు అని పిలుస్తున్నాం. కానీ బిగ్ బాస్ కంటెస్టుగా వెళ్లిన గంగవ్వ కన్నా కింగ్ నాగార్జుననే వయసులో పెద్ద. నాగ్ వయసు ఇప్పుడు 61 సంవత్సరాలు.