
బిగ్ బాస్ సీజన్ 4 కే కొత్త జోష్ ను తెచ్చింది 65 ఏళ్ల గంగవ్వ. ఇంట్లో ఆమెకు ఇచ్చినంత స్పెషల్ ట్రీట్మెంట్ ఏ సీజన్ లోను ఏ కంటేస్టెంట్ కు ఇవ్వలేదు. కానీ ఆరోగ్యం బాగాలేదని ఇంటి నుంచి బయటకు వచ్చేసిన గంగవ్వ, ఆమెకు ఇంట్లో మనవడిగా భావించే వ్యక్తి అఖిల్ గురించి ఎవరికి తెలియని ఒకను కథను చెప్పింది. ఆమె అఖిల్‌ను తన మనవడిగా భావించటమే కాకుండా అతన్ని దత్త తీసుకుంటానని కూడా అనటం జరిగింది. అలాంటి గంగవ్వ అఖిల్ గురించి ఏదైనా చెప్పిందంటే అందులో ఎంతోకొంత నిజం ఉండకుండాపోదని నెటిజన్ల భావన.
అయితే ఇంతకీ గంగవ్వ చెప్పిన విషయం ఏమిటంటే.....అఖిల్ ఒక తెలుగు హీరోయిన్ ను 4 ఏళ్ల పాటు ప్రేమించాడని కానీ ఏవో కారణాల వల్ల ఇద్దరు విడిపోయారని....ఇంటి ముంచి బయటకు వచ్చాక అఖిల్ పెళ్లి చేసుకుంటాడాని గంగవ్వ చెప్పటంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పుడు ఇంట్లో మోనాల్ తో నడుస్తున్న ప్రేమ పెళ్లి వరకు వెళ్తుందా లేదా అది ఓన్లీ ఫ్రెండ్ షిప్ అంటూ బయటకు రాగానే ఎవరి దారులు వాళ్ళు చూసుకొని అఖిల్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా అనేది చూడాలి.