
బిగ్ బాస్ సీజన్ 4 కి కళ, కాంతి గంగవ్వనేనని ఎవరైనా అనాల్సిందే. హౌస్ లోకి ఎంటర్ అయిన కంటేస్టెంట్లలో సగం మంది తెలియని ముఖాల్లే. ఎవరబ్బా వీళ్ళు? అసలు ఒక్కరైనా తెలిసిన ముఖం ఉందా అని అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా యూట్యూబ్ సెన్సేషన్ 63 ఏళ్ల గంగవ్వ ఎంట్రీ ఇచ్చింది. తన యాస, బాషా, ప్రేమ, ముక్కుసూటి తనంతో ప్రజలు ఆమెకు బ్రాహామరథం పడుతున్నారు. షోకు హైప్ తెచ్చేందుకు మొదటి వారంలొనే గంగవ్వను నామినేషన్ లో ఉంచగా భారీ ఓట్లతో సేఫ్ జోన్ లోకి వచ్చింది. అయితే అవ్వ హౌస్ లో ఎక్కువ రోజులు ఉండదని తెలుస్తోంది. మొన్న కంటేస్టెంట్ అరియానాతో నాకు వెళ్లాలని ఉంటే, బిగ్ బాస్ కి నాగార్జున సార్ కి చెప్పి వెళ్లిపోతానని చెప్పుకొచ్చింది. దానికి నాగార్జున శినివారం హౌస్ మేట్స్ తో మాట్లాడుతూ గంగవ్వకు నువ్వు ఉండాలని ప్రజలు నిన్ను ప్రేమిస్తున్నారని చెప్పాడు. మరి అవ్వకు బెంగ వచ్చి వెళ్లిపోతుందా లేదా గట్టిగా ఉండి పోటీపడుతుందా అనేది చూడాలి.