
హీరోయిన్ల మీద పంతుళ్లు, ప్రచారకర్తలు కూడా కామెంట్లు చేసి వార్తల్లో నిలిచేందుకు చూస్తారు. అయితే తాజాగా ప్రచారకర్త గరికపాటి నరసింహరావు ఫిదా భామ సాయి పల్లవి తీసుకున్న ఒక నిర్ణయంపై మొదటిసారి పాజిటివ్ గా స్పందించారు. నేటి తరంకు కూడా అర్ధం అయ్యేలా, కొంత హాస్యం జోడించి మరి ఎన్నో అంశాలపై మాట్లాడే గరికపాటి తాజాగా సాయి పల్లవి తీసుకున్న నిర్ణయానికి ఆమెకి చేతులెత్తి దండం పెట్టి భావోద్వేగానికి గురయ్యారు. నాకన్నా వయసులో చిన్నది అయినప్పటికీ ఆమె నిర్ణయం నన్ను చేతులెత్తి దండం పెట్టేలా చేసిందని చెప్పారు గరికపాటి. ఇంతకీ ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? సినిమాల్లో పొట్టి బట్టలు వేసుకోలేనని, తన సినిమాలు అమ్మానాన్నలు కూడా చూస్తారని అలాంటప్పుడు అసభ్యంగా ఉండకుడదని, రేపు తనకు పిల్లలు పుడితే వాళ్లు కూడా చూసే విధంగా ఉండాలని ఆమె ఆ నిర్ణయం తీసుకుందని ఒక సందర్భంలో చెప్పింది. ఇది విన్న గరికపాటి సాయి పల్లవిని పొగడ్తల్లో ముంచెత్తారు.