
పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన గీత గోవిందం భారీ విజయాన్ని సాధించింది. దీంతో డైరెక్టర్ పరుశురాంకు క్రేజ్ పెరిగింది. అతనితో సినిమా చేసేందుకు హీరోలు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం పరుశురాం నాగచైతన్యతో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. అసలైతే అనుకున్న ప్రకారం గీత గోవిందం తర్వాత గీతా ఆర్ట్స్ బ్యానర్ పై మహేష్ బాబుతో సినిమా చేయాల్సి ఉంది. మహేష్ కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాని పరుశురాం చెప్పిన కథకు మహేష్ ఇంప్రెస్ అవ్వలేదు. దీంతో అల్లు అరవింద్ మరో డైరెక్టర్ ను వేటాడే పనిలో పడ్డారు. ఇక పరుశురాంతో మహేష్ సినిమా లేనట్టేనని ప్రచారం సాగింది. అయితే తాజాగా స్వయంగా గీత గోవిందం డైరెక్టరే మహేష్ తో సినిమా ఉందని కంఫర్మ్ చేసాడు. నాగచైతన్యతో చేసే చిత్రం పూర్తి అవ్వగానే గీతా ఆర్ట్స్ బ్యానర్ పై మహేష్ తో ఉందని తెలిపారు. ఈ మేరకు కధ కూడా ఫైనల్ అయిందని స్పష్టం చేశారు.