
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొన్ని సంవత్సరాలుగా వెండితెరకు దూరంగా ఉన్నారు. బ్రేక్ తీసుకున్నప్పటికీ రికార్డులు బద్దలు కొట్టేందుకు తిరిగి "వకిల్ సాబ్" గా వస్తున్నారు. టైటిల్ సూచించినట్లుగా, పవన్ వకీల్ సాబ్ లో న్యాయవాది పాత్ర పోషిస్తాడు. ఈ సినిమా ప్రశంసలు పొందిన బాలీవుడ్ కోర్టు రూమ్ డ్రామా పింక్ చిత్రంకు రీమేక్. 2018 సంక్రాంతికి విడుదలైన తన చిత్రం 'అజ్ఞతవాసి' తర్వాత గ్యాప్ తీసుకున్న పవన్ తిరిగి రావడానికి వకిల్ సాబ్ సరైన సినిమా అని భావించాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భార్యగా శృతి హాసన్ నటిస్తుందని తాజాగా ప్రచారం సాగినప్పటికి, అధికారిక ప్రకటన లేదు. అయితే ఇప్పుడు, ఈ పాత్రలో మరో భామ పేరు వినిపిస్తుంది. అది మరెవరో కాదు గోవా బ్యూటీ ఇలియానా. ఇలియానా పవన్ కలిసి జల్సా సినిమాలో నటించిన విషయం తెలిసిందే. మళ్ళీ ఇన్నాళ్లకు ఈ కాంబో తెరపై కనిపిస్తుందంటే మామూలుగానే అంచనాలు నెలకుంటాయి. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో, ఇలియానా నటిస్తుందా లేదా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.