
టాలీవుడ్ మాచో స్టార్ గోపిచంద్ నిన్న తన ఫ్యామిలీ పిక్చర్ ను ట్వీటర్ లో అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫోటోకు "ఫ్యామిలీ మూమెంట్" అని క్యాప్షన్ పెట్టాడు. పిక్చర్లో గోపిచంద్ తన ప్రియమైన భార్య రేష్మా, పిల్లలతో కలిసి కనిపిస్తున్నాడు. ఈ ఫోటో, గోపిచంద్ కుటుంబం హోలీ వేడుకల్లో దిగినది తెలుస్తోంది. నటుడు శ్రీకాంత్ మేనకోడలు అయిన రేష్మాను 2013లో గోపిచంద్ పెళ్లాడాడు. అక్టోబర్ 13 2014న ఈ దంపతులకు కొడుకు పుట్టాడు. గోపీచంద్ భార్య రేష్మా, బి టెక్ గ్రాడ్యుయేట్ మరియు 3డి యానిమేషన్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం కలిగి ఉన్నారు. పెళ్లి తర్వాత తన కెరీర్లో అతిపెద్ద విజయాన్ని సాధించినందున గోపిచంద్ లేడీ-లక్ ఇంటికి తీసుకువచ్చిందని ఇంతకు ముందు గోపిచంద్ పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. అంతకుముందు ఒక ఇంటర్వ్యూలో, తన కుమారుడు విరాట్ జన్మించిన తరువాత తన జీవితం మారిపోయిందని గోపిచంద్ వెల్లడించాడు. జిల్ స్టార్ గోపిచంద్, అతని కుటుంబం అతని అతిపెద్ద బలమని,అతని భార్య రేష్మా అతనికి అదృష్టమని చెప్పారు.