
టాలీవుడ్ మాచో స్టార్ గోపిచంద్, రజినీకాంత్ నటిస్తున్న తదుపరి పెద్ద బడ్జెట్ చిత్రం 'అన్నాత్తే'లో నటించనున్నారు. ఇందులో కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటు లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రజనీకాంత్ నటిస్తున్న అన్నాత్తేలో గోపీచంద్ విలన్ గా కనిపించనున్నారు. జయమ్ రవి యొక్క తొలి చిత్రం జయంలో గోపీచంద్ విలన్ పాత్రను పోషించారు. అతను చిత్ర పరిశ్రమలో ఒక విలన్ గా తన కెరీర్ను ప్రారంభించాడు. కానీ తక్కువ టైమ్ లొనే విజయవంతమైన హీరోగా ఎదిగాడు. అయితే జిల్ స్టార్ గోపిచంద్ అన్నాత్తేలో విలన్ గా కనిపిస్తున్నాడా లేదా అనే స్పష్టత బృందం నుంచి రావాల్సి ఉంది. సన్ పిక్చర్స్ నిర్మాణంలో శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అన్నాత్తే 2019 డిసెంబర్ లో లాంచ్ అయ్యి, ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. రజినీకాంత్ చివరిగా ఎఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ డ్రామా దర్బార్ లో కనిపించారు.