
సినీ, రాజకీయ ప్రముఖుల ఇళ్లపై సోదాలు జరగడం ఈమధ్య చాలా కామన్ అయిపోయింది. మొన్నీమధ్యే పలు ప్రముఖ హీరోల ఇళ్లకు వెళ్లి అధికారులు తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇంటిపై జిఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే స్టార్ హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లు, హీరోయిన్లు ఉండగా చిన్న హీరోయిన్ అయిన లావణ్యపై అధికారులు ఫోకస్ చేయడం గమనార్హం. ఉన్నఫలంగా వచ్చి ఆమె ఇంటిపై తనిఖీలు నిర్వహించడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇకపోతే లావణ్య బిజినేసి ట్రాన్సక్షన్స్ పై జిఎస్టీ కట్టకుండా ఎగ్గొటిందనీ ఆరోపణ ఉండటంతో తనిఖీలు నిర్వహించినట్లు డీజీ ఆఫ్ జిఎస్టీ ఇంటలిజెన్స్ అధికారులు తెలిపారు. క్షుణ్ణంగా లావణ్య ఇంటిలో సోదాలు నిర్వహించిన అధికారులకు ఆమె రూ.20లక్షల ట్రాన్సక్షన్ కి జిఎస్టీ ఎగ్గొటిందనీ తేలింది. ఆమె ఇంట్లో లేని సమయంలో ఈ సోదా జరగడంతో విషయం తెలుసుకున్న లావణ్య షూటింగ్ క్యాన్సల్ చేసుకొని వచ్చినట్లు తెలుస్తోంది.