
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రాజమౌళి దర్శకత్వం 'ఆర్ఆర్ఆర్' చివరకు దాని రిలీజ్ డేట్ ను ప్రకటించింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2021 జనవరి 8న సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇంతలో, ఆర్ఆర్ఆర్ షూట్ చురుకైన వేగంతో జరుగుతోంది. మేకర్స్ ఇప్పటికే 75 శాతం షూట్‌ను పూర్తి చేశారు. ఈ చిత్రం గురించి తాజా సమాచారం ఏమిటంటే, రామమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ లో అతిధి పాత్రలో నటించడానికి హంస నందినిని సంప్రదించాలని ఆలోచిస్తున్నారట. గతంలో, రాజమౌళి దర్శకత్వంలో నాని, సమంత నటించిన 'ఈగా'లో హంస నందిని నటించారు. ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్'లో అతిథి పాత్ర కోసం హంస నందినిని సంప్రదించినట్లు, ఆమె వెంటనే ఈ ప్రాజెక్టులో చేరడానికి అంగీకరించినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. సౌత్ ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న సినిమాలో అవకాశం వస్తే హంస నందిని ఒప్పుకోకుండా ఎలా ఉంటుంది మరి.