
తెలుగు బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ కరోనా సమయంలో కూడా విజయవంతంగా నాలుగో సీజన్ పూర్తి చేసుకుంది. అయితే ప్రతి సీజన్ లో అందాలు ఆరబోసే ముద్దుగుమ్మలు ఒకర్నో ఇద్దర్నో యాజమాన్యం దింపుతారన్న విషయం తెలిసిందే. కానీ తాజాగా మరొక విష్యం బయటపడింది. వాళ్ళను స్కిన్ షో చేసేలా బట్టలు వేసుకోమని కూడా యాజమాన్యం చెబుతారట. ఈ విషయాన్నీ స్వయంగా మోనాల్ గజ్జర్ వెల్లడించింది. ఆమెను పొట్టి బట్టలు వేసుకోమన్నారని దానికి ఆమె నో చెప్పటంతో హారికను అడిగినట్లుగా ఆమె చేప్పింది. దీనిపై తాజాగా హారిక లైవ్‌లోకి వచ్చిన క్లారిటీ ఇచ్చింది. తనకు బిగ్ బాస్ టీం ఎలాంటి సూచనలు ఇవ్వలేదని, ఇలాంటి బట్టలు వేసుకోవాలని ఏమీ చెప్పలేదని తనకు నచ్చినవే వేసుకున్నానని చెప్పుకొచ్చింది. అందులో బిగ్ బాస్ టీం చేసిందేమీ లేదని క్లారిటీ ఇచ్చింది. మొత్తానికి తన దుస్తులు, ఆహార్యంపై చర్చ జరుగుతోందని మాత్రం హారిక తెలుసుకున్నట్టుంది.