
బిగ్ బాస్ సీజన్ 4, 16 మంది కంటేస్టెంట్లతో మొదలై ఇప్పుడు 11మందికి చేరింది. మరి ఈ వారం ఎలిమినెషన్ ఉంటే 10మంది అవుతారు. అయితే విళ్ళలో 5 మాత్రం మంచి కంటెంట్ ఇవ్వడంలో సక్సెస్ అవుతున్నారు. వాళ్లే అభిజిత్, అఖిల్, సోహెల్, మెహబూబ్ మరియు దివి. ఈ ఐదుగురు ప్రేక్షకుల దృష్టిని తమవైపుకి తిప్పుకోవడంలో ముందంజలో ఉన్నారు. ఇకపోతే గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ బాస్ కంటేస్టెంట్లలో అతని ఫెవరేట్ ఎవరో సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అందరిలోకి దివి తనకు బాగా నచ్చుతుందని. ఆమె గేమ్ ను ఎంతో స్పోర్టివ్ గా మరియు జెన్యున్ గా అడుతుందని. ఇకపై కూడా అలానే ఆడి అందరిని మెప్పించాలని కోరుతూ దివికి మద్దతు పలుకుతూ సోషల్ మెడియాలో ట్వీట్ చేశారు. మరి ఇది దివి పీఆర్ టీం చేసిన ప్రమోషన్ లో భాగమా లేదా నిజంగానే హరీష్ శంకర్ షో చూస్తూ తన అభిప్రాయాన్ని చెప్పారా అనేది తెలియదు. ఏ కంటేస్టెంట్ రేంజ్ కు తగ్గట్టు ఆ కంటేస్టెంట్ కు పీఆర్ టీం ఉంది. వాళ్లు లేకపోతే ఓట్లు పడటం కూడా కష్టమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.