
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలను ఇటు సినిమాలను మ్యానేజ్ చేస్తున్న విషయం తెలిసిందే. రాజకీయ ప్రచారాలకు అవసరమ్యే డబ్బు కోసం మళ్ళీ సినిమాల్లోకి వచ్చారని విదితమే. బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం 'పింక్' రీమేక్ 'వకీల్ సాబ్' తో పవన్ రిఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన శృతి హస్సన్ నటిస్తుంది. దీని తరవాత క్రిష్ దర్శకత్వంలో 'విరుపాక్ష' సినిమాలో నటించనున్నారు. అయితే, ఇవి పూర్తవ్వక ముందే పవన్ మరో సినిమాకు సైన్ చేసారు. గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ హరీష్ శంకర్ తో జతకట్టనున్నట్లు తెలుస్తుంది. అయితే, ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు కనీసం వచ్చే ఏడాది అవుతుంది. మరి ఇలోపు వేరే సినిమా చేస్తారా? అని హరీష్ అని అడగగా...నా ఫోకస్ అంతా పవన్ సినిమాపైనే అంటూ సమాధానం ఇచ్చారు.