
కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ 'గద్దలకొండ గణేష్' తో మంచి హిట్ సాధించి తిరిగి బౌన్స్ అయ్యాడు. సినిమా విడుదలైన తరువాత హరీష్ శంకర్ తన తదుపరి విషయంపై మౌనంగా ఉన్నారు. హరీష్ శంకర్ గడిచిన నాలుగు నెలలకు పైగా తన తదుపరి చిత్రం గురించి క్లారీటి ఇవ్వలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఈ మాస్ డైరెక్టర్ జత కట్టనున్నట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. పవన్ ను కూడా కలుసుకుని ఒక కథను వివరించాడని, కానీ ఏదో పవన్ కళ్యాణ్ కు ఈ ప్రాజెక్ట్ గురించి నమ్మకం లేదని, దీంతో అది కాస్త పక్కన పడిందని తెలుస్తోంది. అధికాకుండా అతను రెండు ప్రాజెక్టులకు బ్యాక్ టు బ్యాక్ సంతకం చేశాడు. అయితే ఈ మాస్ డైరెక్టర్ ఇప్పుడు మెగా స్టార్ చిరంజీవితో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల దర్శకుడు చిరును కలుసుకుని ఒక కథను వివరించాడు. చిరంజీవి నిర్ణయం తీసుకోవడానికి పూర్తి స్క్రిప్ట్‌తో రావాలని హరీష్ ను కోరారట. చిరు ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఈ నెలలో ప్రారంభమైంది. మరి హరీష్ పూర్తి స్క్రిప్ట్ తో చిరును మెప్పిస్తారో లేదో చూడాలి.