
సోషల్ మీడియా పుణ్యమా అని కేవలం హీరోల బర్త్ డేనే కాకుండా వారి కుటుంబ సభ్యుల బర్త్ డేలు, వారి పిల్లల బర్త్ డేలు అన్ని తెలుస్తున్నాయి. దీంతో అభిమానుల ఫెవరేట్ హీరో కుటుంబంలో ఏ ముఖ్యమైన ఈవెంట్ జరిగిన దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు చూసి మురిసిపోతుంటారు. అలా తాజాగా మెగా ఫ్యామిలీలో ఓ బుల్లి పాప పుట్టినరోజును ఘనంగా జరిపారు. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ముద్దుల బిడ్డ నవిష్క పుట్టినరోజును సినీ ప్రముఖుల మధ్య ఘనంగా జరిపారు. మెగా కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. శ్రీజ గారాలపట్టి నవిష్క పుట్టినరోజు క్రిస్మస్ రోజునే రావటంతో నిజమైన పండుగ వాతావరణం నెలకుంది. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మరి ముఖ్యంగా ఉపాసన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటోలు చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.