
ఈ మధ్య తరచుగా, మహేష్ బాబు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కనిపిస్తున్నారు. అది ఒకోసారి ఒక్కరే లేదా కుటుంబంతో గాని, అతను అక్కడ తరచుగా కనిపిస్తున్నాడు. అలానే తాజాగా, నటుడు మరోసారి విమానాశ్రయంలో కనిపించాడు. ఈసారి, తనలోని చమత్కారాన్ని అక్కడే ఉండే ఫోటోగ్రాఫర్ కమలేష్ ఆనంద్ పై చూపించాడు. ఎప్పుడూ విమానాశ్రయంలోనే ఉంటూ, నగరానికి వచ్చి పోయే సెలెబ్రిటీలను ఫోటోలు తీసేందు కోసం నిత్యం అక్కడే ఉంటాడు. అలాగే, కమలేష్ ఈసారి మహేష్ ను ఫోటో తీయడంలో విఫలం అవ్వలేదు. అయితే, మహేష్ ను ఫోటోలు తీస్తుండగా, కమలేష్ ను ఫోటోలు తీయడం మానేయమని కోరాడు, కాని మొండి పట్టుదలగల కమలేష్, మహేష్ అన్న మాటలను సైతం వీడియో రికార్డ్ చేశాడు. అప్పుడు వెంటనే, మహేష్, 'ప్రతిరోజూ అదే ఫోటోలు క్లిక్ చేస్తుంటే మీకు విసుగు రావట్లేదా? కాస్త గ్యాప్ తీసుకోండి" అంటూ నవ్వుతూ అన్నాడు.