
జనసేన చీఫ్, నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్లకు పైగా గుబురు గడ్డంతో తన లుక్ ను మైంటైన్ చేశారు. 2018 జనవరిలో 'ఆజ్ఞతవాసి' సినిమా చేసిన తరువాత, పవన్ కళ్యాణ్ గడ్డం పెంచుకున్నాడు. ఇప్పటి వరకు అదే లుక్ ను ఉంచాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్- తాత్కాలికంగా పేరు పెట్టిన 'వకీల్ సాబ్' కోసం గుబురు గడ్డంతో కొన్ని ఎపిసోడ్ల చిత్రీకరించారు. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా పన్యం ప్రాంతానికి చెందిన జనసేన పార్టీ నాయకులతో జరిగిన రాజకీయ సమావేశంలో పవన్ కళ్యాణ్ క్లీన్-షేవె చేసుకోని కొత్త లుక్ లో కనిపించారు. కోర మీసంతో, పొడవాటి జుట్టుతో ఫ్రెష్ లుక్‌లో పవన్ కళ్యాణ్‌ను చూసి అందరూ షాక్ అయ్యారు. సన్నిహిత వర్గాలు చెబుతున్న దానిబట్టి, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసమే పవన్ తన లుక్ మార్చారు. మరి క్రిష్ సినిమా కోసమే పవన్ తన గెటప్ మార్చారా అనేది తెలియాలి అంటే కొంత సమయం వేచి చూడాలి.