
ఈ సంవత్సరం 'భీష్మ' లాంటి సూపర్ హిట్ చిత్రం అందించిన యువ నటుడు నితిన్, లాక్డౌన్ సమయంలో తన లేడీ లవ్ షాలినితో మూడుముళ్ళతో ఒకటయ్యాడు. ఇక లాక్డౌన్ ఎత్తువేసి పలు నిబంధనలతో షూటింగ్‌లకు అనుమతివ్వడంతో అందరిలానే ఇప్పుడు హీరో నితిన్ కూడా తిరిగి సెట్లలోకి వచ్చాడు. తాజా అప్డేట్ ప్రకారం చంద్రశేఖర్ యెలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కుతున్న 'చెక్' షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాడు. భవ్య క్రియేషన్స్ పతాకంపై రకుల్ ప్రీత్ సింగ్ మరియు ప్రియ ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామా ఇప్పటికే 40శాతం షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్లు ఇక ఇప్పుడు నిర్విరామంగామిగితా షూట్ ను పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా శరవేగంగా ముగించి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు నితిన్ హిందీలో బ్లాక్ బస్టర్ అయిన 'అందాదున్' తెలుగు రీమేక్ లో నటించనున్న విషయం తెలిసిందే.