
హీరో రాజశేఖర్ కొన్ని రోజుల క్రితం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. విజయవాడలో ఓ కార్యక్రమంలో పాల్గొని ఓఆర్ఆర్ మీదుగా హైదరాబాద్ వస్తున్న ఆయన కారు అదుపు తప్పి మూడు పాల్టీలు కొట్టి బోల్తా పడింది. వెంటనే ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ప్రమాదంకు కారణం అతివేగమని తెలుసుకున్న సైబరాబాద్ పోలీసులు రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయవలసిందిగా ఆర్టీఏను కోరారు. ఇప్పటికే రాజశేఖర్ ట్రాఫిక్ రూల్స్ ను పలు మార్లు ఉల్లంఘించిన నేపథ్యంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన నటించిన గరుడ వేగ రిలీజ్ కు కొన్ని రోజుల ముందు పీవీ ఎక్స్ప్రెస్ ఫ్లై ఓవర్ పై తన కారుతో మరో కారును ఢీ కొట్టడం జరిగింది. దీంతో ఆ వ్యక్తి రాజశేఖర్ తాగి నడిపాడు అంటూ ఫిర్యాదు చేయటంతో పోలీసులు డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు చేయగా ..ఆయన తాగలేదని ప్రూవ్ అయింది.