
బిగ్ బాస్ సీజన్ 4 మంచి రంజుగా సాగుతుంది. నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ బిగ్గెస్ట్ రియాల్టీ షో ఇప్పటికే 6 వారలు పూర్తి చేసుకొని ఏడోవారం లోకి అడుగుపెట్టింది. ఆరోవ వారంలో కుమార్ సాయి ఎలిమినెట్ కావడంతో బయట షోపై రచ్చ మొదలైంది. అనధికారిక పోల్స్ లో కూడా ఎక్కడా చూసిన మోనాల్ కు తక్కువ ఓట్లు వచ్చాయి. ఆమెనే ఎలిమినెట్ కావాలని నెటిజన్లు కోరుకున్నారు కానీ ఆమె వెళ్ళిపోతే ఇంట్లో మసాలా తగ్గుతుంది, గ్లామర్ డోస్ తగ్గుంది అందుకే యాజమాన్యం కుమార్ సాయిను ఎలిమినెట్ చేసినట్లుగా కధనాలు వస్తున్నాయి. ఈ విషయం పక్కన పెడితే గత వారమే నాగార్జున కనపడరు అనుకుంటే వీకెండ్ వచ్చి మామూలుగానే మస్తీ చేశారు. కానీ ఈ వారం నుంచి మాత్రం నాగార్జున సుమారు 4 వారాల పాటు కనిపించబోరని అతని స్థానంలో ఫయర్ బ్రాండ్, లేడి సినియర్ స్టార్ హీరోయిన్ 'రోజా సెల్వమని' కనిపించనున్నట్లు సమాచారం. మరి ఇదే నిజమైతే షో చాలా వాడివేడిగా సాగటం ఖాయం. ఇంటి సభ్యులు తోక జాడిస్తే రోజా ఎలా ఫయర్ అవుతుందో మనందరికి తెలిసిందే.