
"హిట్" టీంకు గొప్ప విజయం సాధించింది. నటుడు విశ్వక్ సేన్, రుహానీ శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ "హిట్" ప్రతి ఒక్కరికీ లాభదాయకమైన సినిమాగా మారింది. ఈ చిత్రాన్ని విదేశాలలో విడుదల చేసిన ప్రైడ్ సినిమా, ఇది సాధించిన విజయానికి చాలా సంతోషంగా ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆదివారం సాయంత్రం నాటికి, ఈ చిత్రం అమెరికాలో 230వేల డాలర్లను వసూలు చేయగా, ఆస్ట్రేలియాలో సోమవారం నాటికి 37వేల డాలర్లను వసూలు చేసింది. ఈ చిత్రం ఇప్పటికే విడుదలైన చాలా ప్రదేశాలలో బ్రేక్ ఈవెన్ ను సాధించింది. దీంతో సినిమాలో పాల్గొన్న ప్రతి ఒక్కరు ఆనందంగా ఉన్నారు. విదేశాలలో సౌత్ సినిమాలను పంపిణీ చేస్తున్న ప్రైడ్ సినిమా, యంగ్ డైరెక్టర్ శైలేశ్ 'హిట్' లాంటి భిన్నమైన చిత్రాన్ని ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. వాల్ పోస్టర్ బ్యానర్ పై నాని, ప్రశాంతి టిపిరినేని నిర్మించిన ఈ చిత్రంకు కధ, కథనంను నమ్మినందుకు మంచి లాభలనే తెచ్చిపెట్టింది.