
గోవా బ్యూటీ ఇలియానా ఒకానొక సమయంలో తెలుగు కుర్రకారు గుండెల్లో తిష్టవేసి కూర్చుంది. అమెకోసమే సినిమాకు వెళ్లే వాళ్లంటే అతిశయోక్తి కాదు. దేవదాస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు పోకిరి సినిమాతో పిచ్చి క్రేజ్ సంపాదించుకొని స్టార్ హీరోయిన్ గా మారింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుసగా మహేష్, పవన్, అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది. కెరియర్ మంచి పిక్ టైంలో ఉన్నప్పుడు బాలీవుడ్‌కు జంప్ అయ్యింది. కానీ బీ టౌన్ లో ఆమె అనుకున్నట్టుగా కెరియర్ సాగలేదు. పెద్దగా హిట్స్ లేకపోవడం, మధ్యలో ప్రేమ వ్యవహారం ఇలా వెండితెరకు దూరమయ్యింది. ఇప్పుడు కెరియర్ పై ఫోకస్ పెట్టాలనుకుంటున్న ఇలియానా తాజా ఇంటర్వ్యూలో బాలీవుడ్లో తనకు సరైన హిట్ లేకపోవడానికి కారణాలు ఏంటో చెప్పింది. హిందీలో పోకిరిని వాంటెడ్ పేరుతో రీమేక్ చేశారు. అందులో హీరోయిన్ గా నన్నే అడిగారు కానీ నేను ఆ సమయంలో ఎగ్జామ్స్ రాస్తుండటంతో కుదరలేదు. తర్వాత తెలుగులో కిక్ సినిమాను అదే పేరుతో రీమేక్ చేశారు. ఆ సినిమాలో కూడా నన్నే అడగగా డేట్స్ కుదరకపోవటంతో చేయలేకపోయానను. అలా రెండు సూపర్ హిట్స్ మిస్ అయ్యానని తెలిపింది.