
తెలుగు సెలబ్రిటీలు హోలీ పండుగను పూర్తి ఫ్యామిలీలతో కలిసి జరుపుకుంటున్నారు. సెలబ్రిటీలు హోలీ వేడుకల నుండి ఫోటోలను పోస్ట్ చేసి వారి అభిమానులకు సోషల్ మీడియా ద్వారా పండుక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ రోజు హోలీ సందర్భంగా, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబంతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో ఉంచారు. ఇందులో భార్య లక్ష్మీ ప్రణతి మరియు పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ’హోలీ వేడుక చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫోటోలో, ప్రతి ఒక్కరూ తెలుపు రంగు బట్టలు వేసుకొని, చల్లిన పసుపు రంగుతో కుటుంబం పండుగను ఫుల్ ఎంజాయ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఫొటోలో ఎన్టీఆర్ పిల్లలను చూసి అభిమానులు లైకులు కోడుతూ, షేర్లు చేస్తున్నారు. ఇక, ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ లో కొమరం బీమ్ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. దీని తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు.